నీకోసం -3

  • 1.1k
  • 1
  • 381

ఆఫీస్‍కి రెడీ అవసాగింది ప్రణతి.  చిన్నప్పటి నుండీ కూడ అక్కలు వాడిన డ్రెస్సులే వేసుకునేది.  దానికే ఆమెకి చాలా ఉక్రోషంగా ఉండేది. ఆ గదిలోనుండి తెచ్చి బెడ్ మీద పెట్టిన బట్టల వైపు చూసింది. ఈ బట్టలు ఎవరివో బయటివాళ్లవి.  వాళ్ళు ఎవరో ఎలాంటివారో తెలియదు,  వాళ్ళు వాడి వదిలేసిన బట్టలు ఇప్పుడు ఆమె వేసుకుంటోది.  కానీ ఇప్పుడు ఆమెలో ఉక్రోషం లేదు.  జైలు జీవితం ఆమెకు నేర్పిన చాలా విషయాల్లో సర్దుకుని పోవడం ఒకటి.  ఎంతో హుషారుగా ఉండే ఆమె ఇప్పుడు స్థబ్దుగా ఉంటోంది.  బెస్ట్‍ఫ్రెండ్ అమృత్ గుర్తుకి వచ్చాడు.  మనసులో కలిగిన బాధావీచిక కళ్ళల్లో నీటిబొట్టై నిలిచింది ప్రణతికి.                ఆమె ప్రమేయం లేకుండానే ఆమె మనసు మూడేళ్ళ క్రితం జరిగిన ఆ సంఘటన దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ రోజు... డిశంబర్ ముప్పై ఒకటి! కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చాలా గ్రాండ్ పార్టీ జరిగింది.  చాలా మంది ఫ్రెండ్స్ గేదర్ అయ్యారు.   అంతా యూత్.  అరుపులు, కేకలు, సంతోషం, సంరంభం