కలుసుకుందాం రా...

  • 510
  • 1
  • 165

"కలుసుకుందాం రా"అంటూ వనజకుమారి నుండి పిలుపు.ఫోన్ పెట్టేయగానే క్షణాలతేడాతో ...దాదాపు యాభైపిలుపులు!!ఆనందంతో ఉబ్బితబ్బిబ్చయ్యాడు దాసు .ఆ కలయిక దాదాపు ఇరవైరోజుల తరవాత అని నిశ్చయ మయ్యాక .........గడియారాలు చెడిపోయినట్లు..  అదనపుజీతభత్యాలకు ఆశపడి ఆసూర్యుడు తనడ్యూటీటైంలో వోవర్ డ్యూటీ చేస్తున్నట్లూ..చీకటిరాత్రి..వేకువఝాములు ..టీవీసీరియల్ లలా సాగిసాగి గుండెల్ని తొలుస్తున్నట్లూ అనిపిస్తోంది దాసు మనస్సుకి.***     ***  ***  *** కలుసుకోవలసిన వారిని తలుచుకుంటూ తీపిజ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ..ఇరవైరోజుల్లో  దాదాపు పదిదాకా నిదురలేని రాత్రుల్ని  భరించాడు దాసు.నత్తలా నడుస్తున్న కాలపు నిర్లక్ష్యపువైఖరిపై..మనస్సులోనే దుమ్మెత్తిపోసుకుంటూ ..బీ పీ పెంచుకుంటూ ...మాత్రలతో కంట్రోల్ చేసుకుంటూ తల్లడిల్లిపోయాడు ఉత్కంఠతో.**         **        **ఎలాగైతేనేం.....అర్ధరాత్రికీ అర్ధరాత్రే ఇంగ్లీష్ డేట్ మారటంతోపాటే....సెల్ ఫోన్ లో అతను సెట్ చేసుకున్న అలారం మ్రోగటంతో ..ఆ రోజు రానే వఛ్చింది దాసు గుండెల్లోకి!!ఏమాత్రం ...అతని ప్రమేయం లేకుండా అనియంత్రితంగా అతని మనసుతో పనిలేకుండా...ఊపిరితిత్తుల్లో ఉచ్ఛ్వాసనిశ్వాసలు నడుస్తున్నాయ్ ..గుండెలో హృదయస్పందనలు కలుగుతున్నాయ్ ఐతే..అతని మనస్సు మాత్రం ..ఉదయం జరుగబోయే కలయికల కార్యక్రమం గురించి ఆలోచించటంలో తన శరీరాన్నే తాను మరచిపోయింది.కానీ ......కాలకృత్యాలను మాత్రం అతనిశరీరం....యాదృచ్ఛికంగా అనియంత్రితంగా తీర్చుకుంటోంది.సమయంఉదయం ఏడు గంటలైంది.టిఫిను