నిజమైన కల

  • 291
  • 114

నాన్నా డైరీ మిల్క్ ...మీకు ఇష్టమైంది,ఇంకా ఈ కూతురికి ఇష్టమైంది జరిగింది అంటూ ముక్క విరిచి నోట్లో పెట్టింది అంకిత్ కూతురు మీనా..చాక్లెట్ పెరు వింటే అమ్మ గుర్తొస్తుంది..తనను ఓ ఆట ఆడించేది..పండుగ,పుట్టినరోజా,లేక చెప్పడానికి ఇప్పుడు ధైర్యంగా అనిపిస్తుంది,ఆప్పుడైతే అమ్మ ముందే పాంట్ తడిచిపోయేది..డైరీ మిల్క్ ఓ యాభై తెండి!ఉండండి..ఉండండి!మీ క్లాస్ స్ట్రేంత్ ఎంతరా చిన్నమ్మా!?ఎందుకమ్మా!అమాయకంగా అడిగాడు అంకిత్,వనజ కొడుకు..ఆశ్చర్యం భర్తగారి వంతు కూడా అయింది..వనజ ఎం చేసినా వెంటనే ప్రశ్నించడం వివేక్ కి ఇష్టం ఉండదు..ఆ పహేలీ తానే చేధించాలి అనుకుంటాడు..చిరునవ్వుతో బండి దగ్గర అలానే నుంచున్నాడు..ప్లీస్ అమ్మా!ఎం కంపు చెయ్యొద్దమ్మా!ఇప్పుడు మన ముగ్గురిలో ఎవ్వరి పుట్టినరోజూ లేదు..పండుగ సీజన్ కూడా కాదు..నీకు దణ్ణం ..నోర్ముయ్యరా!నువ్వు చెబుతావా,స్కూలుకు ఫోన్ చేసి నేనే కనుక్కోనా!?అమ్మ ఆగేలా లేదు అనిపించి యాభైరెండు అన్నాడు..ఓ డెబ్భై తెండి..కాలనీలో కూడా పంచాలి..ఆర్డర్ వేసి లోపలికి వెళ్ళిపోయింది..లంచ్ బాగ్ ఏదిరా!పుస్తకాల బాగ్ భుజాన వేసుకున్న కొడుకును ప్రశ్నించేడు.వద్దు నాన్నా!అతి