నువ్వేనా..నా నువ్వేనా.. 6*గమనిక :- నువ్వేనా నా నువ్వేనా 5 వ భాగం పొరపాటున కవిత లా సేవ్ అయింది గమనించగలరు...ఇంటికి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావు... ఏంటా పరుగు.. అది.. అ..దీ.. డాడ్.. అని కంగారుగా చూస్తుంది హిమ..ఈ లోగా ఎక్కడికి పరుగు అంటు వరుణ్ అక్కడికి వచ్చేశాడు..చచ్చాం అనుకుంటూ తల పట్టుకుని వరుణ్ కి రావద్దు అని సైగ చేసినా అర్ధం కాక వాట్ మేడం అంటు భుజం మీద చేయి వేసి ఎదురుగా ఉన్న హిమ డాడ్ నీ హాయ్ వర్మ సర్ అని విష్ చేస్తాడు..వర్మ అప్పటికే కోపంగా చూస్తున్నాడు..వర్మ కోపం దేవుడా... నువ్వు నిజంగానే ఉన్నావా నన్ను ఇలా బుక్ చేశావు అనుకుంటూ ఓ వెర్రి నవ్వు నవ్వి ఎదో మంత్రం వేసినట్టు మాయమైపోతాడు వరుణ్..వస్తున్న నవ్వుని ఆపుకుంటూ వెళ్దామా హిమ అంటాడు కోపం నటిస్తూ..ఓకే డాడ్ అంటు వర్మ వెనుక వెళ్తుంది హిమ..వర్మ సర్ హిమని