అచ్చిరాని అతితెలివి

  • 345
  • 123

తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ, చెత్త ఏరుతున్నట్టు నటిస్తూ ఇంటి గుమ్మం ముందు నిలుచున్నాడు జాకీ. వీధి తలుపుకు ఉన్న గోద్రెజ్ తాళంకప్పను చూడగానే వాడి కన్నులు మెరిసాయి. జేబులోంచి తాళపుచెవిని తీసి కప్పలో దూర్చి రెండు త్రిప్పులు త్రిప్పేసరికి తాళం తెరచుకుంది. లోపల ప్రవేశించి, తలుపు మూసేసాడు.            జాకీ ఓ ర్యాగ్ పిక్కర్. పదిహేడేళ్ళుంటాయి. పొడవుగా, పీలగా ఉంటాడు. కాంప్లెక్స్ ల నుండి చెత్త కలెక్ట్ చేసుకుని బండిలో తీసుకువెళ్ళే రజని వాడి గాళ్ ఫ్రెండ్. జాకీకి రజని అంటే పిచ్చిప్రేమ. తాను కోరింది ఇవ్వకపోతే ఊరుకోదామె. రోజుల తరబడి వాడితో మాట్లాడడం మానేస్తుంది.వారం రోజుల్లో వారి అభిమాన నటుల సినిమాలు – ‘అల వైకుంఠపురములో...’, ‘సరిలేరు నీకెవ్వరు’ - ఒకేసారి విడుదలకాబోతున్నాయి. వాటికి తీసుకువెళ్ళమని అడిగింది రజని. పాప్ కార్న్ తింటూ సినిమా చూడడమంటే ఇష్టం ఆమెకు. జాకీ దగ్గర