పంచప్రాణాలు

  • 345
  • 153

‘‘యువరానర్‌... ఎంత కిరాతకంగా నేరానికి పాల్పడ్డాడో, అంతే కఠినశిక్ష విధించాలని విజ్ఞప్తి చేస్తున్నాను...’’‘‘యువరానర్‌.. నేరం చేసినప్పుడు వయసుని కూడా దృష్టిలో పెట్టుకుని తక్కువశిక్ష విధించాలని కోరుతున్నాను. ఇప్పటికే ఆరేళ్లుగా తీవ్ర మానసిక క్షోభకి లోనయ్యాడు...’’ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దేశాయ్‌, డిఫెన్స్‌ న్యాయవాది అనక్‌ లెటోలు చెబుతున్నది వింటూ, ‘‘వయసుని దృష్టిలో పెట్టుకునే ఇంత నేరంచేశాడంటారా, మిస్టర్‌ అనెక్‌ లెటో?’’ అని ప్రశ్నించాడు జడ్జి.ముగ్గురి మొహాలూ చూస్తూ బోనులోనిలబడ్డాడు డయాజ్‌...స్నేహాల్‌ డయాజ్‌... గంపెడు బట్టలు ఉతుకుతూంటే చేతులు నొప్పెడుతున్నాయి. బకెట్లో వేసి పిండుతూంటే ఆ నీళ్ళల్లో తల్లి రూపమే కన్పిస్తోంది. తల్లి తల పట్టుకుని నీళ్ళలో ముంచుతూ చంపడానికి ప్రయత్నిస్తున్న తండ్రి... ఒకసారి కాదు, చాలాసార్లు. ‘‘ఏరా? ఏంటీ?’’ అని వీపు పగిలేలా కొట్టింది సవతి తల్లి వచ్చి, ‘‘ఉతుకు! ఉతికితేనే నీకు బతుకు!’’ జుట్టుపట్టుకుని కసిదీరా వంగదీసింది. బాధతో అరిచాడు.‘‘అవన్నీ ఉతికాకే తిండి పెట్టాలి!’’ ఇంట్లోంచి తండ్రి అరుపు.ఉదయం నుంచీ మధ్యాహ్నం