కుటుంబ విలువలు

తండ్రీ కొడుకులు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తున్నారు. గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి పిల్లవాడికి నేర్పిస్తున్నాడు. గాలిపటం బాగా ఎత్తుకు, వెళ్ళాక దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి.కొడుకు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ వెలుగులో తండ్రి మనసు ఉప్పొంగిపోయింది. కొంతసేపు దారాన్ని చేత్తోపట్టుకున్నాక కొడుకు తండ్రిని అడిగాడు.“నాన్నా దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తుకి ఎగిరిందే! దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకుఎగిరిపోతుంది కదా” అన్నాడు.తండ్రి నవ్వాడు. “దారాన్ని తెంపేద్దామా మరి?” అని అడిగాడు. “తెంపేద్దాం నాన్నా” అన్నాడు కొడుకు ఎంతో ఉత్సాహంగా.ఇద్దరూ కలిసి దారాన్ని తెంపేశారు.“టప్’ మని దారం తెగిపోగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరిపోయింది. అంతలోనే దారి తప్పి అటూ ఇటూ కొట్టుకుంటూ కిందికి పడిపోవడం మొదలుపెట్టింది! చివరికి ఎవరి మేడ మీదనో కూలిపోయింది.“ఇలా జరిగింది ఏంటి నాన్నా” అన్నాడు కొడుకు విచారంగా,దారం తెంపేస్తే గాలిపటం ఇంకా ఇంకా పైకి పోతుందనుకుంటే, కిందికొచ్చి పడిపోవడం ఆపిల్లాడికి నిరుత్సాహం