అదో ప్రశాంతమైన వాతావవరణం. జోరుగా గాలి, చల్లని చిరు జల్లు, గొడుగు పట్టుకొని ఒకవైపు ఓని పైట జరిపోతుందేమో అనే భయం, లంగా తడిచిపోతుందేమో అనే తపన ఆలస్యమయితే ఎక్కడ అమ్మ తిడుతుందో అనే భయం, అప్పటికి ఎలాగో ఖష్ట పడి నళిని, నలినంగా ఇంటికి చేరుకుంది. అమ్మ ఏంటీ వర్షం లో ఇలా తడిచి రాకపోతే ఎక్కడైనా ఆగి వర్షం ఆగిన తరవాత రావొచ్చుకదా. నువ్వేమైనా ఇంకా చిన్న పసిపాపవా తడవడానికి అని విరుచుకు పడింది అమ్మ. వెంటనే నాన్న సరే లేవే వచ్చేసింది కదా వదిలేయ్ అన్నారు. ఆహా ఇక ఆ సంతోషానికి హద్దులు లేవు.రాత్రి 8అయ్యింది ఎదురుగ కిరాణాషాపు నుండి 8ఏళ్ళ అబ్బాయిలు అక్క నీకు ఫోన్ వచ్చింది అన్నాడు. సరేరా వస్తానంటూ పరిగెత్తుకు వెళ్ళింది నళిని. హలో, అంటూ ఎవరు అని అడిగింది. వెంటనే నరేష్ ఎవరో ఎందుకు ఫోన్ చేస్తారు చెలి నేనే నరేష్