ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర మంగవేణి, వనజ కనక బాలన్స్ చేసివుండకపోతే తనూజ వెనక్కిపడిపోయేదే. బాలన్స్ కాసుకున్నాక తనూజ వేగంగా సుస్మిత ఎదురుగా మరోసారి వెళ్లి తన కుడిచేత్తో కుడిచెంపమీద ఈడ్చిపెట్టి కొట్టింది. వెంటనే సుస్మిత మొహం షాక్ తో నిండిపోయి తన కుడిచేతిని, కుడిచెంపమీద పెట్టుకుంది. "ఏం జరిగింది? నన్నెందుకిలా కొట్టావ్?" అయోమయంగా గొణిగింది. "మై గాడ్! ఆఖరికి నిన్నిలా కొట్టాల్సి కూడావచ్చింది." సుస్మితని గట్టిగా కౌగలించుకుని భోరుమంది తనూజ. "నువ్వే ఇలా ఎమోషనల్ అయిపోతే ఎలా చెప్పు? సమస్యకి పరిష్కారం ఆలోచించాలి కానీ." ముకుందం తనూజ దగ్గరిగా వచ్చి, అనునయంగా తన కుడిభుజం మీద చెయ్యి వేసి అన్నాడు. "ఆఖరికి ఆ భూతవైద్యుడి ఉపాయం కూడా ఇలా బెడిసి కొట్టింది. ఇంక ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో నాకైతే బోధపడడం లేదు." తలని రెండు