పల్లెటూరి

  • 1.2k
  • 315

ఒక పల్లెటూరి వ్యక్తి మొదటిసారిగా బస్సు ఎక్కుతాడు. ఆ వ్యక్తి డ్రైవర్కు వెనుక ఉన్న సీట్లో కూర్చుంటాడు. మొదటిసారి బస్సు ఎక్కడం వలన అతనికి అంతా కొంత విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది .ఇలా డ్రైవర్ వెనుక సీట్లో కూర్చొని డ్రైవర్ చేసే పనులన్నింటినీ ఆసక్తిగా గమనిస్తూ ఉంటాడు. డ్రైవర్ స్టీరింగ్ ఎలా తిప్పుతున్నాడు, గేర్ ఎలా వేస్తున్నాడు అని చూస్తూ అంతా విచిత్రంగా ఉందే అని అనుకుంటూ ఉంటాడు మనసులో. ఒక చోట టీ తాగడానికి బస్సు ఆపుతారు.అందరూ బస్సు దిగి టీ తాగడానికి వెళ్తారు. తిరిగి వచ్చిన ఆ బస్సు డ్రైవర్ బస్సు గేర్రాడ్డు అక్కడ లేకపోవడాన్ని గమనిస్తాడు. అప్పుడు ఆ డ్రైవర్ గేర్రాడ్డు కోసం చుట్టూ చూస్తాడు… మన పల్లెటూరి పెద్దాయన తన చేతిలో గేర్రాడ్డు పట్టుకుని, ఆ డ్రైవర్ పక్కనే నవ్వుతూ నిలబడతాడు.అప్పుడు ఆ డ్రైవర్ ఆ పెద్దాయన తో ఇలా అంటాడు” ఏంటయ్యా నీకేమైనా బుద్ధుందా?