నువ్వేనా..నా నువ్వేనా.. 2

  • 1.2k
  • 480

ముందు భాగాలు చదివిన తర్వాత రెండవ భాగం చదవండి..నిన్న....అందరు పొద్దునే టిఫిన్ చేస్తున్నారు..మామయ్యా నిన్న కాలేజీకి విజయ్ రాలేదు బంక్ కొట్టి సినిమాకి వెళ్ళాడు అని ఇరికిస్తుంది హాని (రేణు నీ హాని అని పిలుస్తారు)..పేరుకి హనీ చెప్పేవన్ని అబద్ధాలే... తను కుడా రాలేదు ఎందుకో అడుగు అత్తయ్యా అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు విజయ్..హనీ నీ పిలిచి ఎందుకు వెళ్ళలేదనీ చీవాట్లు పెడుతుంది సీత..పారిపోయాడా లేకపోతే మామయ్యాతో చెప్పి అంతుచూసే దాన్ని కోపంతో ఉగిపోతూ..హనీ రోజు రోజుకి నీ అల్లరి పెరిగిపోతుంది అని చెవి మెలివేస్తుంది సీత..మామయ్యా మామయ్యా మీ చెల్లి నన్ను చంపేస్తుంది... అని పెద్దగా అరుస్తుంది..చిన్న పిల్లని పట్టుకొని ఇంత గట్టిగానా మదలించేది చూడు చెవి ఎలా కందిపోయిందో అని సీత మీద అరుస్తు రేణు నీ దగ్గరికి తీసుకుంటాడు భూపతి..చూశావా అని కళ్ళు ఎగరేస్తుంది రేణు..చూడు వదిన అన్నయ్యా దాన్ని ఎలా గారాబం చేస్తున్నాడో అసలు అది