చేసిన తప్పును తెలుసుకొని తనని తాను సరిదిద్దుకున్న ఓ ఇంతి కథ. పెళ్ళి నిశ్చయించారు పెద్దలు. పెళ్ళి రేపు అనగా ఇంట్లో డబ్బులు, నగలు తీసుకొని తను ఇష్టపడిన రాహుల్ తో పారిపోయింది పెళ్ళి కూతురు భాను. పెళ్ళికి మంచి ముహూర్తాలు లేవంటూ కొద్ది రోజులు జీవితాన్ని లవర్స్ గా ఎంజాయ్ చేద్దామని తనని నమ్మించి సొంతం చేసుకున్నాడు. కొద్ది రోజులు ఎటువంటి ఆంక్షలు లేకుండా సరదాగా గడిపారు. పెళ్ళి చేసుకుందాం అంటే ఎప్పుడూ మాట దాటేసేవాడు. మూడు నెలల తరువాత భాను నెల తప్పింది. ఆ విషయం రాహుల్ కి చెప్పి ‘పెళ్ళి చేసుకుందాం. ఆలస్యం అయితే ప్రమాద’మని చెప్పింది. రాహుల్ పెళ్ళికి కావాల్సినవి తెస్తానని చెప్పి బయటకి వెళ్ళిన వాడు తిరిగి రాలేదు. భాను కంగారు పడుతూ ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. భాను తెచ్చుకున్న నగలు, డబ్బులు కూడా లేవు. భానుకి అర్థమైంది తను మోసపోయానని!అమ్మ, నాన్నలకి