ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 6

  • 678
  • 303

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "అప్పుడు తనకున్న అప్పులన్నీ మా అన్నయ్య తీర్చేసి, నాతో పాటే తనని చదివించడం మొదలుపెట్టాడు. తనకి మంచి ఎడ్యుకేషన్ కావాలని నన్ను జాయిన్ చేసిన కాలేజ్ లోనే తననీ జాయిన్ చేసాడు. తను అంతో ఇంతో ఆస్థి ఉన్నవాడిని కట్టుకుని జీవితంలో సుఖపడాలని తన తల్లి కోరిక. అది తీర్చాలనే నీ కజిన్ వెంట పడింది. వాడెలాంటి వెధవో ఎప్పుడో తనకి తెలిసే ఉంటుంది. కానీ అప్పటికే విడదీసుకోలేనంతగా వాడితో కమిట్ అయిపోయి ఉంటుంది. అందుకనే నా అడ్వైజ్ ని కూడా పట్టించుకోలేదు." మరోసారి దీర్ఘంగా నిట్టూర్చాడు మదన్. "తన విషయంలో నేను ఎంత పెద్ద తప్పు చేసానో నాకు అర్ధమైంది మదన్, ఈ విషయం నాకు కొద్దీ రోజుల ముందే తెలిస్తే ఎంతో బావుండేది. నా కజిన్ ఎంత పెద్ద