ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 5

  • 618
  • 282

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "బహుశా అదే కారణం వల్ల కావచ్చు నేనేరోజు తనని ఆ దృష్టితో చూడలేక పోయాను. తను నన్ను ఎప్పుడైతే ప్రేమిస్తూందని తెలిసిందో నేనప్పుడే తనకి చాలా స్పష్టంగా చెప్పను. నాకు తన మీద అలాంటి ఉద్దేశం లేదని, అలాంటి భావాలూ ఆలోచనలు పెట్టుకోవద్దని. కానీ తను వినలేదు. నా మనసు మార్చడానికి తను చెయ్యని ప్రయత్నం లేదు. నా అన్నావదినాలకి కూడా తనంటే అంతో ఇంతో ఇష్టమే కావడం, తన పేరెంట్స్ కి కూడా తనని నాకిచ్చి పెళ్లి చెయ్యాలని ఉండడం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది. తనని ప్రేమించమని, ఇంకా పెళ్లి చేసుకోమని నన్ను చాలా ఇరిటేట్ చేసేది. నేనెక్కడికి వెళ్లిన నా వెనకే వచ్చేది. ఆ రోజు కూడా నా వెనక వంతెన వరకూ వచ్చాక, నా కుడి