ధర్మ- వీర - 8

  • 525
  • 225

ధర్మ, వీర ని అక్కడ్నుండి తీస్కుని వెళ్ళిపోతాడు. తరువాత రోజు, పోలీసులు శివయ్య గారి ఇంటికి వస్తారు. శివయ్య :- ఏమైంది, ఎందుకు ఇంతమంది పోలీసులు వచ్చారు. పోలీస్ ఇన్స్పెక్టర్ :- సూర్య గారు మీ కొడుకే కద? శివయ్య :- అవును ఇన్స్పెక్టర్ గారు. ఇన్స్పెక్టర్ :- మీ అబ్బాయి సూర్యగారు చనిపోయారు, అతని శవం గుడికి దగ్గర లో ఉన్న అడవిలో దొరికింది. అది విన్న వెంటనే శివయ్య గారి కళ్ళలో నీళ్లు వచ్చి, ఒక్కసారిగా బాధతో కుప్పకూలిపోతారు. వెంటనే శివయ్య వాళ్ళ భార్య ఏడుస్తూ వచ్చి ఆయన్ని పట్టుకుంటుంది. శాంతి కిందకి వస్తుంది, విషయం తెలియగానే శాంతి కూడా బాధతో క్రుంగిపోతు ఏడుస్తుంది.శివయ్య కుటుంభం అంతా సూర్య చనిపోయిన చోటుకి పోలీసులుతో వెళ్తారు. శివయ్య సూర్య ని చూసి గుండె పగిలేలా అరుస్తూ బాధపడతాడు. శివయ్య :- ఎవరు చేసారు ఇన్స్పెక్టర్, నా కొడుకు ని ఈ పరిస్థితి కి తీసుకొచ్చింది ఎవరు? ఇన్స్పెక్టర్ :- సూర్య గారితో పాటు మేము