ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 4

  • 1.2k
  • 675

ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ రామ కృష్ణ కొట్ర "నిజంగానా?" తనకి తెలియకుండానే తనూ రాతి మీదనుండి కిందకి దిగిపోయి, ఆమెకి ఎదురుగా వెళ్లి, ఆమె మొహంలోకి చూస్తూ అన్నాడు మదన్. "నేనస్సలు నమ్మలేకపోతున్నాను." "చెప్పానుగా నేనిప్పుడు నీకు అబద్ధాలు చెప్పానని." సమ్మోహనంగా నవ్వింది సుస్మిత. "నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావేమో, నాతో మాట్లాడతావేమో అని చాలా ఆశగా ఎదురుచూశాను. కానీ  నువ్వు నా దగ్గరకి రావడానికి కానీ, నాతో మాట్లాడడానికి కానీ మళ్ళీ ప్రయత్నించనే లేదు. ఈ లోపున పరీక్షలు అయిపోయాయి. నువ్వు వెళ్లి పోయావు. అదే నీకు అక్కడ ఆఖరి సంవత్సరం కాబట్టి నిన్ను మళ్ళీ కాలేజీలో కలుసుకునే అవకాశం కలగలేదు." కాస్త ఆగింది. ఆమె చెప్పేది నమ్మలేనట్టుగా ఆలా చూస్తూనే వుండిపోయాడు మదన్. తను హ్యాండ్సమ్ గా ఉంటానని మదన్ కి తెలుసు. కానీ ఇలాంటి