నిరుపమ - 19

  • 702
  • 282

నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "అయితే ఆ కారణం కూడా మీకు తెలిసే ఉంటుంది. నిజం చెప్పండి, ప్లీజ్." వేడుకోలుగా చూస్తూ అంది మేనక. "ఒక థియరీ వుంది. చాలా వరకు అదే నిజం అనిపిస్తూంది. కానీ ఇప్పుడే బయటపెట్టను. ఎనీహౌ ఇంకా టైం వుంది కదా." కుర్చీలో అడ్జస్ట్ అవుతూ అన్నాడు స్మరన్. "నేను మిమ్మల్ని చెప్పమని అడగను. ఎందుకంటే మీరు చెప్పరని నాకు బాగా తెలుసు. మీరనేదల్లా ఏంటంటే, యూజ్ యువర్ మైండ్ అండ్ బ్రేక్ యువర్ హెడ్." కుర్చీలో వెనక్కి  జారగిలబడుతూ గలగలా నవ్వింది మేనక. "ఎనీహౌ నిన్ను బాగా షాక్ చేసే ఇంకొక విషయం కావాలంటే చెప్తాను." మేనక మొహంలోకి చూస్తూ అన్నాడు స్మరన్. "చెప్పండంకుల్. ఐ యాం క్యూరియస్." కుర్చీల్లోనుంచి ముందుకి వాలి, బల్ల మీద మోచేతులు బాలన్స్ చేసుకుని, స్మరన్ మొహంలోకి ఆసక్తిగా చూస్తూ