నిరుపమ - 15

  • 648
  • 327

నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "వండర్ఫుల్ ఇండీడ్." తలూపి అన్నాడు నిరంజన్. మరికాసేపు నిరంజన్ తో మాట్లాడక అక్కడినుండి వెళ్లిపోయారు సమీర, మేనక. & "నేను లేని నాలుగు రోజులు మా అమ్మాయిని ఇలా ఇక్కడ ఉండనిచ్చినందుకు చాలా థాంక్స్." ప్రతిమ అంది. "తనకి ఇన్నేళ్లు వచ్చినా నేనెప్పుడూ తనని వంటరిగా ఇంట్లో వదలిపెట్టి వెళ్ళలేదు. అందుకనే తనని మీ ఇంట్లో ఉంచాల్సి వచ్చింది." చెప్పినట్టుగానే ఆ ఆదివారం ఉదయం ఆ ఇంటికి వచ్చింది ప్రతిమ. మేనక ముందే చెప్పి ఉండడం వాళ్ళ ప్రతిమ గురించి ఎదురు చూస్తూనే వున్నరు రంగనాథ్ ఇంకా నిర్మల. నిర్మల గురించి చెప్పిన విషయం గుర్తుండి ఆలా చెప్పింది ప్రతిమ. "నిజంగా మేమే మీకు థాంక్స్ చెప్పాలి. తనుండడం వాళ్ళ మాకు చాల ఆనందం కలిగింది. ఇప్పుడే కాదు ఎప్పుడు మీరెక్కడికి వెళ్లాల్సివచ్చినా తనని మా ఇంట్లో