నిరుపమ - 14

  • 972
  • 438

నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "ఐ స్టార్ట్ ఫస్ట్." మేనక నవ్వి అంది. తరువాత తనకి కలిగిన ఎక్స్పీరియన్స్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసింది. "ప్లీజ్. డోంట్ సే ఇట్స్ మై హల్యుసినేషన్. నేనెంతో రియల్ గా ఫీలయ్యాను. నాకు మొదటినుండి ఆ రూంలో నాతో పాటుగా ఎవరో ఉన్నారన్న ఫీలింగ్ వుంది. కానీ నాకప్పుడు ఆ ఫీలింగ్ యింకా ఎంతో గట్టిగా  కలిగింది. నా మెడ మీద ఎవరిదో ఊపిరి కూడా ఫీల్ అయ్యాను."   "ఇది హల్యుసినేషన్ కాకపోతే మరింకేమనాలి? ఇది మరోరకంగా అన్వయించి చెప్పడానికి నేను సైకాజిస్ట్ నే కానీ పారా సైకాజిస్ట్ ని కాదు." నవ్వి అన్నాడు నిరంజన్. "నువ్వే కొంచం అనలైజ్ చేసి చూడు. అదేగదిలో ఆ అమ్మాయి ఉరేసుకుని చనిపోయింది. నువ్వు పడుకునే ఆ బెడ్ మీద సీలింగ్ ఫ్యాన్ కే ఉరేసుకుంది. సబ్ కాంషస్ గా