నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "ఆయన మీకూ బాగా తెలుసా ఆంటీ?" కాఫీ కప్పు తీసుకుని సిప్ చేస్తూ అడిగింది మేనక. "ఒకటి రెండు సార్లు మా అమ్మాయి తో పాటుగా వెళ్లి కలిసాను. చాలా చక్కటి మనిషి. అయన మాటల వింటూవుంటే ఎంతో రిలీఫ్ గా అనిపిస్తుంది. అంతే కాకుండా అయన ఇచ్చే సలహాలు అన్ని కూడా ఎంతో ప్రాక్టీకల్ ఇంకా ఎఫెక్టివ్." "మోనోపాజ్ టైం లో తనకి చాలా చికాగ్గా అనిపించేది. అప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను. మనసు స్థిమితం చేసుకోవడానికి ఆయనేవో ఒకటిరెండు సలహాలు ఇచ్చారు. అవి మా అమ్మకి బాగా పనిచేసాయి. అప్పటినుండి అయన చాలా గొప్ప అంటుంది." నవ్వింది సమీర. "నువ్వు వెళ్లి ఒకసారి ఆయన్ని చూసావంటే నువ్వూ అలాగే అంటావు. నేను నిజంగా ఆయనవల్ల అంత ఇంప్రెస్ అయి ఉండకపోతే, సమీర పోస్ట్ గ్రాడ్యుయేషన్