మనసిచ్చి చూడు - 10

  • 1.8k
  • 847

               మనసిచ్చి చూడు - 10రెస్టారెంట్లోకి అడుగు పెట్టడం ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇద్దరికి.మనస్పూర్తిగా మాట్లాడుకోవడానికి మంచి ప్లేస్ల ఉంటుంది.నీకు ఏమీ కావాలో ఆర్డర్ ఇవ్వు సమీరా అంటాడు గౌతమ్.మీరు ఏది తింటారో అదే చెప్పండి అని అంటుంది తను.కాసేపటికి ఇడ్లీ,సాంబార్ తింటూ ఇంత కూల్ వెదర్లో టిఫిన్ చాలా బాగుంది అని ఆస్వాదిస్తు తింటారు.తిన్న తరువాత సమీరా అడుగుతుంది ఇప్పుడు కేరళ ఎందుకు అని....??ఇన్ని రోజులు ఇంటి దగ్గరే కదా ఉన్నాము.మార్పు సహజంగా రావాలి అంటే ప్రదేశం కూడా మారాలి సమీరా.నిన్ను చాలా బాధ పెట్టాను కానీ ఇంక నుంచి నువ్వు బాధ పడే ఏ పని చేయను అన్నాడు.ఇది కలో నిజమో ఏమీ తెలియడం లేదు కానీ మనసు మాత్రం చాలా సంతోషంగా ఉంది అండీ అంది.ఇది కల ఏమీ కాదు అని గిల్లుతాడు,సరే టైమ్ అవుతుంది