ధర్మ- వీర - 6

  • 1.3k
  • 581

వీర :- నీకు ఏప్పట్నుంచి తెల్సు? ధర్మ :- నాకు మొదటినుంచి తెల్సు, కానీ ప్రాణానికి ప్రాణమైన నా దగ్గరే నిజం దాచావంటే నీ ప్రేమ ని ఎంతలా కాపాడాలని అనుకుంటున్నావో నేను అర్ధంచేసుకున్నాను. నువ్వు ఏదో ఒక కారణం చెప్పి నన్ను కలవకుండా బైటికి పని మీద పోతున్నా అని చెప్పినప్పుడు, శాంతి దగ్గరికే వెళ్తున్నావని నాకు తెలుసు. అందుకే ఎప్పుడు నిన్ను నాకంటే ముఖ్యమైన పని ఏముందిరా అని అడగలేదు. వీర :- నన్ను క్షమించు, నేను నికు ముందే చెప్పాల్సింది. నమ్మకం లేక కాదు, భయంతో చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆ భయమే నిజమైంది. ధర్మ :- నా దగ్గర కూడా నిజం దాచిన నువ్వు, అజాగ్రత్తగా తెలీకుండా ఏదో తప్పు చేసావ్. మనకు కాకుండా ఈ విషయం ఇంకెవరికి తెల్సు? వీర కుంచెం అలోచించి ఒక్కసారిగా సమాధానం దొరికి :- వాళ్ళ ఇంటి పనోడు, వాడే నిన్న మమ్మల్ని చూసాడు. కానీ