నిరుపమ - 7

  • 852
  • 423

నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "ఒకవేళ బాధ పడితే తను ఎందుకు బాధ పడి వుంటుంది? ఇంట్లో ఏదైనా జరిగి వుంటుందా?" " అలా జరిగేందుకు అవకాశమే లేదు. నిరుపమ పేరెంట్స్ అంతగా తమ పిల్లల్ని ప్రేమించే పేరెంట్స్ ఉంటారని నేను అనుకోను. ఏ రకంగాను వాళ్ళు తనని హర్ట్ చెయ్యరు." "ఒకవేళ కాలేజీ లో కానీ, వచ్చే దారిలో కానీ ఏమైనా జరిగి వుంటుందా?" "ఆ రోజు కాలేజీ జరగనే లేదు. మా ఇళ్ళకి కాలేజీకి పెద్దగా దూరం ఏమి లేదు. వాకబుల్ డిస్టెన్స్. ఇంకా మేము వెళ్లే రోడ్ అంతా కూడా జనాలతోటి, ట్రాఫిక్ తోటి వుంటుంది." "మీ కాలేజీ ఎన్ని గంటలకి స్టార్ట్ అయి ఎన్ని గంటలకి పూర్తవుతుంది?" " పధి గంటలకి ప్రారంభం అవుతుంది. ఐదు గంటలకల్లా అయిపోతుంది. మేము మార్నింగ్ నైన్ థర్టీ అలా ఇంటిదగ్గర