నిరుపమ - 4

  • 1.1k
  • 534

నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది) శివ రామ కృష్ణ కొట్ర "మీకు ఆల్రెడీ పరిచయం చేసేసానుగా ఈ అమ్మాయి మా అక్క కూతురని." మేనక వైపు చూస్తూ మొదలుపెట్టాడు స్మరన్. " మా అక్క బ్యాంకు మేనేజర్. కొన్ని రోజులపాటు అర్జెంటు పనిమీద వేరే వూరు వెల్తూ వుంది. తనెప్పుడూ మేనకని ఒక్కర్తినీ ఇంట్లో వదలి వెళ్ళలేదు. నా దగ్గర వుంచుదామన్నానేను నా అసైన్మెంట్స్ మీద తిరుగుతూ వుంటాను. మీకు అభ్యంతరం లేక పోతే మా మేనకని మీ ఇంట్లో కొంచెం రోజులు ఉంచుదాం అనుకుంటాన్నాను. మీరు కాదనరనే ఉద్దేశంతో నేను మా అక్కకి చెప్పేసాను కూడా తన కూతుర్ని మీ ఇంట్లో వుంచుతానని. నా స్నేహితుడి ఇంట్లో తన కూతురిని ఉంచడానికి మా అక్కకి ఎటువంటి అభ్యంతరం లేదు." "ఇది నిజంగా మీరు ఇలా అడగాల్సిన విషయమా? సింపుల్గా మేనక మీ ఇంట్లో కొన్ని రోజులు ఉంటుందని