మనసిచ్చి చూడు - 1

  • 6.8k
  • 2.2k

మనసిచ్చి చూడు.....1అత్తయ్య ఈరోజే కదా చివరి రోజు నాకు ఈ ఇంట్లో రేపటి నుంచి నేను మీకు ఎవరికి కనిపించకూడదు కదా అంటూ ఏడుస్తూ ఉమా గారిని పట్టుకొని ఏడుస్తుంది సమీరా.                  సమీరా ఏడుపు చూసి ఉమా గారికి కూడా చాలా బాధ వేస్తుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.ఏడవకు సమీరా వాడి మనసు మార్చే ప్రయత్నం నేను చేస్తాను,తప్పకుండా మిమ్మల్ని కలుపుతాను.నువ్వు మా ఇంటి కోడలివి నిన్ను ఎందుకు బయటకు పంపుతాను.ఎమ్ చేసైనా మీ ఇద్దరు కలిసి ఉండేలా చేసే బాధ్యత నాది తల్లి నువ్వు బాధ పడకు సమీరా.         లేదు అత్తయ్య మీరు ఎన్ని చెప్పిన ఆయన మనసు మారదు.పెళ్ళికి ముందే చెప్పారు కదా ఏడు నెలలు మాత్రమే భార్యగా అని.అప్పుడు నా కుటుంబం కోసం తల వంచాను.ఈ ఏడు నెలలలో రాని