జీవితం న్యాయమా?అన్యాయమా ?

  • 2.3k
  • 729

విలువ : ధర్మంఉపవిలువ : సత్ప్రవర్తన.కర్ణుడు , కృష్ణుడి తో ఇలా అన్నాడు – “జీవితం లో నాకు చాలా అన్యాయం జరిగింది. వివాహం కాని యువతికి జన్మించటం నా తప్పా ?నేను పుట్టిన తక్షణమే నా తల్లి నన్ను విడిచి పెట్టింది . రాజభవనంలో పెరగవలసిన నేను సూతుని ఇంట పెరగ వలసి వచ్చింది. సూత పుత్రునిగా పరిగణించ బడటం వలన ద్రోణాచార్యుల వారి వద్ద ధనుర్విద్య పూర్తిగా నేర్చుకోలేక పోయాను. “పరశురాముని వద్ద విద్య సంపూర్ణంగా నేర్చుకున్న ప్పటికీ నేను క్షత్రియుడను కావడం వలన యుద్ధ సమయంలో తాను నేర్పిన విద్య నాకు గుర్తు రాకుండా ఉండాలి అని శాపం పొందవలసి వచ్చింది. ఇది నా తప్పేనా? అసలు విద్య నేర్చుకుంటున్నప్పుడు నేను క్షత్రియ వంశం లో పుట్టానని నాకు తెలియదు.              “ఒక బాలుడు పరుగున వచ్చి నా రథం క్రింద