అరె ఏమైందీ? - 18

  • 789
  • 417

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ ఎక్కడికి వెళ్ళేది? నువ్వుకూడా నాతొ భోజనానికి అక్కడికి వస్తున్నావు. నువ్వూ వస్తేనే నేను వెళ్ళేది. మనోజ్ మొహంలోకి చూస్తూ అన్నాడు అనిరుధ్. ఈ అబ్బాయిని చూసినట్టుగానే వుంది, కానీ గుర్తురావడం లేదు. మనోజ్ మొహంలోకి చూస్తూ అంది తనూజ. ఈ వూళ్ళో చలపతి గారని గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా చేస్తూ ఉండేవారు. అయన అబ్బాయి. ఇప్పుడు ఆయనకి టౌన్ లోకి ట్రాన్స్ఫర్ కావడం వల్ల అక్కడికి మారిపోయారుఫ్యామిలీ అంతా. తన పేరు మనోజ్. అనిరుధ్ అన్నాడు. గుర్తుకు వచ్చింది. అయన భార్య మాల్లీశ్వరి గారు నాకు బాగా పరిచయం. తన ఇంటికి కూడా నేను ఎక్కువగా వెళుతూ ఉండేదాన్ని. అన్నట్టు నీకొక చెల్లెలు కూడా ఉండాలికదా. వుంది. తన పేరు ప్రమీల. ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి ఇంట్లో ఖాళీగానే వుంది. మాకేమన్నా