అరె ఏమైందీ? - 5

  • 1.4k
  • 688

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ ఇంక నేను వెళ్లివస్తాను. కుర్చీలోనుండి లేచి అన్నాడు అనిరుధ్. నీ లక్ష్యం కేవలం ఐ ఏ ఎస్ మాత్రమే అని నాకు తెలుసు. కానీ నీ గురించి ఎవరన్నా ఫీల్ అవుతూ వుంటే అది తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఒక ఐ ఏ ఎస్ ఆఫీసర్ అయిన తరువాత కూడా ఆడతోడు లేకుండా మాత్రం జీవితం గడపవు కదా. తనూ లాప్ టాప్ తో పాటుగా కుర్చీలోనుండి లేచి అంది ప్రమీల. నీ ఉద్దేశం నాకు అర్ధం అయింది. నీ మనసులో అభిప్రాయం కనిపెట్టలేనంత బ్లైండ్ కాదు నేను. చిరునవ్వు నవ్వాడు అనిరుధ్. కానీ ఒక్క విషయం స్పష్టంగా చెప్తాను. మనోజ్ నిన్నెలా చూస్తాడో నేనూ అలాగే చూస్తాను.   నిన్నా దృష్టితో ఎప్పుడూ చూడలేను. నువ్వూ మంజీర ఏ కాదు, మనిద్దరం కూడా చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం.