అరె ఏమైందీ? - 4

  • 1.1k
  • 552

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ నువ్వు చెప్పిందీ నిజమే అయినా, నేను ఏమీ ఆలోచించకుండా తనని పెళ్లి చేసేసుకోలేను. నాతో తన పెళ్ళికి వాళ్ళు అంతగా ఆలోచిస్తూండడంలో ఏదో పెద్ద రహస్యం వుందనిపిస్తూంది. అదేమిటో మొదట తెలుసుకోవాలి. అనిరుధ్ సాలోచనగా అన్నాడు. దీనికి ఒక మార్గం వుంది. ఇది వర్క్ అవుట్ కావచ్చు కూడా. అదేమిటో ముందు చెప్పు. నువ్విలా సస్పెన్స్ మైంటైన్ చెయ్యాల్సిన అవసరం లేదు. చిరాగ్గా అన్నాడు అనిరుధ్. నువ్వా నిరంజన్ ని కలుసుకుని మాట్లాడు. నీకూ మంజీర కి పెళ్లి జరిపించడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయని చెప్పు. మంజీరని వదులుకోవడానికి వాడు అంత తేలికగా ఒప్పుకుంటాడని నేను అనుకోను. అందుగురంచయినా వాడు నీకు విషయం అంతా చెప్పొచ్చు. వాడి మొహం చూడ్డం అంటేనే నాకు చిరాకు. వాడిని కలుసుకుని మాట్లాడ్డం నాకసలు ఇష్టం లేదు. చిరాగ్గా అన్నాడు అనిరుధ్. కానీ