అరె ఏమైందీ? - 3

  • 1.3k
  • 719

అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ కాకపోతే సర్వేశ్వరం అదృష్టం అన్ని విషయాల్లోనూ కలిసి రాలేదు. మంజీరకి పన్నెండేళ్ల వయసు వున్నపుడు కాబోలు, నిర్మల చనిపోయింది. ఎందుకనో ఆ సమయంలో ఆవిడ పిచ్చి బాగా పెరిగి, బ్లడ్ ప్రెజర్ బాగా పెరిగి, ఎదో విపరీతం జరిగి చనిపోయిందని చెప్తారు. అసలు ఎం జరిగిందో అనిరుధ్ కి తెలియదు కానీ, ఆ కుటుంబంలో మాత్రం ఆ తరువాతనుండి చాలా మార్పులు వచ్చాయి. అప్పటివరకూ తన తండ్రితో ఎంతో స్నేహంగా వుండే సర్వేశ్వరం తన తండ్రితో మాట్లాడడం మానేసాడు. నిర్మల చనిపోవడంతో తన తల్లికి ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం రాలేదు.  నిజంగా ఎక్కువమార్పు మంజీరలోనే వచ్చింది. తను వాళ్ళింటికి వెళ్లి పలకరించినా తనతో మాట్లాడడం మానేసింది. తను ఆ విషయం తన తల్లితో అప్పట్లో ఫిర్యాదు చేసాడు కూడా. ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నకొద్దీ మగపిల్లలతో అంతా