బలహీనతా లేక బలమా ..?

  • 2k
  • 1
  • 657

కొన్నిసార్లు మీకున్నటువంటి  అతిపెద్ద బలహీనత మీకు  అతిపెద్ద బలం అవుతుంది. ఉదాహరణకు, ఇక్కడ ఒక జరిగిన కథను చర్చిద్దాం.ఒక 10 సంవత్సరాల బాలుడు అతను తక్వండో నేర్చుకోవాలని  నిర్ణయించుకున్నాడు. కొన్నిరోజుల తర్వాత ఒక భయంకరమైన  కార్ ఆక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో తన తండ్రితో పాటు తన ఎడమ చేయిని కూడా పోగొట్టుకున్నాడు. అతను తన తక్వందో మాస్టారు దగ్గరికి వెళ్లి ,ఇక నేను నా జీవితంలో తక్వందో నేర్చకోలేను అని చెప్పాడు. ఆ మాట విన్న మాస్టారు నువ్వెందుకెలా అనుకుంటున్నావు..? నీకున్న ఇష్టంతో మరియు పట్టుదలతో నువ్వు ఒక్క చేత్తో కూడా నేర్చుకుని విజయాన్ని సాధించగలవు అన్నాడు. ఆ మాట విన్న బాలుడికి మొదట ఏమి అర్ధం కాకపోయినా. మాష్టారు మీద ఉన్న  నమ్మకం  కారణంగా తక్వండోని వదిలిపెట్టలేదు. ఇంకా ఎక్కువ సాధన చేయడం ప్రారంభించాడు. తక్వండో  స్కూల్ లో తనతో పాటు చాల మంది విద్యార్థులు ఉండేవారు. మాస్టారు అందరికి ఎన్నో రకాల కిక్స్