నులి వెచ్చని వెన్నెల - 17

  • 1.2k
  • 516

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ “ఆ విషయం వదిలేయండి. అది తెలుసుకోవడానికి నేనెలాగూ వున్నాను కదా. ఇంకా ముఖ్యమైన విషయాలు చెప్పాల్సినవి ఏమైనా వున్నాయా?” “మా డాడ్ నాతో అంతగా చెప్పాలనుకుని చెప్పకుండా చనిపోయిన ఆ విషయం ఏమిటన్నదే తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి నేను ఇప్పటివరకూ చెప్పినది చాలు.” “సమీరా, నీకు కలుగుతూన్న ఆ వింత అనుభవాలు, ఆ హల్యూసీనేషన్స్ మాటేమిటి? వాటి గురించి కూడా చెప్పు.” తనూ తనకి చేసిన ప్రామిస్ ని గుర్తుచేస్తున్నట్టుగా అన్నాడు అనురాగ్. “మిస్ సమీరా, మీరు ఏ విషయం దాచకుండా నాకు చెప్పడానికి అగ్రీ అయ్యారు.” స్మరణ్ గుర్తు చేశాడు. “ఆల్రైట్.” సమీర తలూపింది. “ఎక్జాట్ గా ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పలేను. కానీ నాకు ఎవరో నవ్వుతున్నట్టుగా, ఏడుస్తున్నట్టు గా, ఇంకా నన్ను పిలుస్తున్నట్టుగా అనిపిస్తూ వుంటుంది. అంతేకాదు నన్ను ఈ మధ్య ఎవరో తాకుతున్నట్టుగా కూడా వుంటూ