నులి వెచ్చని వెన్నెల - 13

  • 1.4k
  • 636

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "అయితే తను ప్రస్తుతం పేస్ చేస్తూన్న ఈ డిజార్డర్ వల్ల మనకి ఇబ్బంది ఏమీ లేదంటావా?" "అలాని చెప్పలేను. ఈ సైకలాజికల్ డిజార్డర్స్ డెవలప్ అయ్యి తమకి, ఎదుటవాళ్ళకి కూడా ప్రమాదం సృష్టించే అవకాశం కూడా వుంది. ఐ సజెస్ట్ స్ట్రాంగ్ ట్రీట్మెంట్ టు హర్. ఆవిడ ఒప్పుకుంటే, తనని ట్రీట్ చెయ్యడానికి నాకు అభ్యతంరం లేదు." మల్లిక అంది. "అయితే నేను తనతో మాట్లాడి చూస్తాను. తను మంచిమనిషే. తానొక సైకలాజికల్ డిజార్డర్ తో బాధ పడుతోందని, తనకి ట్రీట్మెంట్ అవసరమని చెప్తే మరోలా అనుకోదు." సమీర మొహంలోకి చూస్తూ అన్నాడు అనురాగ్. "అప్పుడే వద్దు అనురాగ్. ఆ విషయం ఆలోచించి చేద్దాం." తను నీరజ ని అడిగిన హెల్ప్ గురించి అనురాగ్ కి ఇంకా మల్లిక కి తెలిస్తే వాళ్లెలా రియాక్ట్ అవుతారా అన్న ఆలోచన వచ్చి అనీజీ