వినాయక చవితి కథ

  • 3.6k
  • 1
  • 1.3k

భారతదేశంలో అత్యంత ఉత్సాహంతో మరియు భక్తితో జరుపుకునే ప్రధాన పండుగలలో గణేష్  చతుర్థి ఒకటి. ఈ పండుగ వినాయకుని పుట్టినరోజును సూచిస్తుంది. వినాయకుడుని విఘ్న నాయకుడిగా, శుభములను కలిగించేవాడిగా పరిగణిస్తారు. ఈ పండుగను వినాయక చతుర్థి లేదా వినాయక చవితి అని కూడా అంటారు. ఈ రోజుని , హిందూ మతంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది, ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో ఈ పండగని విస్తృతంగా జరుపుకుంటారు.గణేష్ చతుర్థి పండుగ మరాఠా పాలనలో మొదలైంది. చత్రపతి శివాజీ మహారాజ్ ఈ పండుగను ప్రారంభించారు. శివుడు మరియు పార్వతి దేవి యొక్క కుమారుడైన గణేశుడు పుట్టిన కథలో నిజం ఉందని అందరి నమ్మకం. అతని పుట్టుకకు సంబంధించిన అనేక కథలు ఉన్నప్పటికీ, చాలాఎక్కువుగా వినబడే కథ – పార్వతీ దేవి గణపతిని సృష్టించింది. ఆమె, శివుడు లేకపోవడంతో, తన గంధపు ముద్దను ఉపయోగించి గణేషుడిని సృష్టించి, తాను స్నానానికి వెళ్ళినప్పుడు కాపలాగా ఉంచింది. ఆమె వెళ్లిన