నులి వెచ్చని వెన్నెల - 8

  • 1.5k
  • 780

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "ఎస్, యు అర్ రైట్." తలూపి అంది సమీర. "ఒకసారి డాడ్ బ్యాంకు లో కంపెనీ షేర్స్ ప్లెడ్జి చేసి, లోన్ తీసుకుని, కొత్త ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేద్దామనుకున్నారు. అందుకు నువ్వు ఎంతమాత్రం ఒప్పుకో లేదు.  అప్పుడు డాడ్ బాగా హర్ట్ అయ్యారు. తను చాలా ఆశ పడ్డారు, ఆ కొత్త యూనిట్ స్టార్ట్ చేద్దామని. నువ్వంతగా అడ్డుపడకపోతే స్టార్ట్ చేసేవారు. నువ్వు వెళ్ళిపోయినా పర్లేదు కొత్త యూనిట్ స్టార్ట్ చేసేమని డాడ్ కి నేను సలహా కూడా ఇచ్చాను." సమీర అంది. "నేను ఆ ఆలోచనని అంతగా అపోజ్ చెయ్యడానికి, ముఖ్యంగా రెండు కారణాలు వున్నాయి. మొదటిది, ఆ స్పేర్ పార్ట్శ్ తయారు చెయ్యడం లో మనకి అసలు అనుభవం లేదు. అందుకు కావలసిన స్కిల్ల్డ్ పీపుల్ మనదగ్గర లేరు. అంతేకాకుండా ఆ స్పేర్ పార్ట్శ్ కి చాలా