నులి వెచ్చని వెన్నెల - 4

  • 1.8k
  • 927

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ అనురాగ్ కూడా కుర్చీలోనుంచి లేచి సమీరకి అపోజిట్ గా వచ్చాడు. "నిజంగా ఒక విషయం గురించి మీ డాడ్ అంతగా ఆందోళన పడ్డారా? ఇది నాకు ఆశ్చర్యంగా వుంది. ఏ విషయం గురించి అయినా అలా ఆందోళన పడే మనస్తత్వం కాదాయనది. సమస్యలని చాలా సులువుగా సాల్వ్ చేస్తారు." సడన్గా అనురాగ్ మోహంలో కూడా ఆందోళన, ఇంకా ఆశ్చర్యం కనిపించాయి. "ఎస్, అనురాగ్. అదే నాకూ ఆందోళనగా వుంది. డాడ్ నే ఆందోళన పెట్టిన ఆ విషయం ఏమిటో నాకూ ఎంత ఆలోచించినా బోధపడడం లేదు." అనురాగ్ కూడా అలా ఆందోళన పడడం తన ఆందోళనని ఇంక ఎక్కువ చేసింది.  "ఆయన రాసిన డైరీ చదివావా? డాడ్ కి డైరీ రాసే అలవాటు వుంది. అందులో ఏమైనా మెన్షన్ చేసి వుండొచ్చు." "చదివాను. అందులో కూడా ఏం మెన్షన్ చెయ్యలేదు." "అందర్నీ