నులి వెచ్చని వెన్నెల - 2

  • 1.7k
  • 999

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "డాడ్ మీకు తెలుసుగా ఈ మీటింగ్ ఎంత ఇంపార్టెంటో. నేనొచ్చి కేవలం వన్ వీక్ మాత్రమే అయింది, ఒక రౌండ్ అఫ్ మీటింగ్ మాత్రమే డిస్ట్రిబ్యూటర్స్ తో అయింది. ఇంకా త్రి రౌండ్స్ అఫ్ మీటింగ్స్వున్నాయి డాడ్. ఆలా ఎలా వచ్చేగలను?" తనని తన డాడ్ ఎందుకలా అడిగాడు అన్నది ఆలోచించడానికి ట్రై చేస్తూ అంది. "మరేం పర్లేదు. అదంతా మళ్ళీ మేనేజ్ చేసుకోవచ్చు. నువ్వు ఇమ్మీడియేట్ గా బయలుదేరి ఇండియా కి వచ్చేయ్." తను మరొకసారి షాక్ తింది. తనని తన డాడ్ అలా వచ్చేయ మన్నందుకు కాదు, ఆయన వాయిస్ లో ఆందోళన తనకి ఎక్కువ కంగారు కలిగిస్తూవుంది. తన డాడ్ గురించి తనకి బాగా తెలుసును. ఏ విషయానికి కంగారు పడే మనిషి కాదు. ఎంత పెద్ద సమస్య అయినా ఎంతో స్థిమితంగా, చక్కగా అలోచించి నిర్ణయం