ఇది కథ కాదు.. జీవితం!

  • 4.6k
  • 1
  • 1.8k

మన వల్ల సాధ్యం కాదు అనేది మదిలోకి రాకుంటే.. మనిషి ఎంత పనైనా చేస్తాడు. ఇద్దరు అన్నదమ్ముల్లో.. ఒకడికి పదేళ్లు, మరొకడికి ఆరేళ్లు. వాళ్లిద్దరూ ఊరి బయట పొలం దగ్గర సరదాగా అడుకుంటున్నారు. చిన్నోడు ముట్టుకునేందుకు వస్తుండగా.. పెద్దోడు వాడికి దొరకకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు. ఇలా పరుగెడుతూ.. ఆ పెద్దోడు చూసుకోకుండా ఓ బావిలో పడిపోయాడు. వాడికి ఈత రాదు. పైగా బావి చాలా లోతుగా ఉంది. అరిచినా సాయం చేయడానికి చుట్టుపక్కల ఒక్కరూ లేరు. చిన్నోడికి అక్కడ తాడు కట్టిన బొక్కెన ఒకటి కనిపించింది. తాడును పట్టుకుని బొక్కెనను బావిలోకి జారవిసిరాడు. "అన్నా...దీన్ని పట్టుకో" అన్నాడు. నీట మునిగి తేలుతూ కేకలేస్తున్న పెద్దవాడు తాడును అందుకున్నాడు. చిన్నోడు తన శక్తినంతా కూడగట్టుకుని తాడును పైకి లాగడం మొదలు పెట్టాడు. "అన్నా... భయపడకు.. జాగ్రత్తగా పట్టుకో.. పడిపోకుండా చూసుకో" అంటూ నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు. తాడు చివరను అప్పటికే