తెలుగు నీతి కథలు

  • 3.7k
  • 1
  • 1.3k

ఆత్మీయులకు విలువ ఇవ్వండి, విలువ: ప్రేమ, అంతర్గత విలువ: క్షమ, కృతజ్ఞతఒకప్పుడు ఇద్దరు స్నేహితులు ఒక ఎడారిలో నడుస్తున్నారు. త్రోవలో ఒకచోట ఇద్దరిమధ్యా ఏదో వాదన జరిగింది.ఇద్దరిలో ఒకతను రెండవవాని చెంపపై కొట్టాడు. చెంపదెబ్బ తిన్న మిత్రుడు ఏమీ మట్లాడకుండా, ”ఈ రోజు నా ప్రాణస్నేహితుడు నన్ను చెంపదెబ్బ కొట్టాడు” అని ఇసుకలో రాసాడు. ఒక ఒయాసిస్ దగ్గరగా కనిపించేవరకు నడిచి, ఒయాసిస్ కనిపించేక అందులో దిగి స్నానం చేద్దామని అనుకున్నారు. చెంపదెబ్బ తిన్న మిత్రుడు ఊబిలో దిగి కూరుకుపోసాగాడు. కాని రెండవవాడు అతను కూరుకుపోకుండా కాపాడాడు. స్నేహితుడు ఊబి నుండి పైకి లాగి కాపాడిన తరువాత అతడు ఒక రాతిపై ” నా స్నేహితుడు ఈరోజు నా ప్రాణం కాపాడాడు” అని రాసాడు. ముందు చెంపదెబ్బ కొట్టి తరువాత తానే తన స్నేహితుడి ప్రాణం కాపాడినవాడు తన మిత్రునితో ” నిన్ను కొట్టినపుడు ఇసుకలో రాసావు,ఇప్పుడు కాపాడినపుడు రాతిపై రాసావు,