జీవితం

  • 3.3k
  • 1
  • 1.3k

రవి, నిజానికి చాలా మంచి అబ్బాయి. ప్రతీ సంవత్సరం మంచి మార్కులతో పాస్ అవుతూ ప్రస్తుతం ఏడవ తరగతి చదువుతున్నాడు. రవి ఒక్కడే సంతానం అయినందున తల్లి చాలా గారాబంగా చూసుకునేది. రవి తండ్రి ఒక ఆక్సిడెంట్ లో చనిపోయాడు. ఒకసారి రవి వాళ్ల స్నేహితుల మాటలు విని, వాళ్లతో కలిసి క్లాస్ లోని ఒక అమ్మాయిని ఏడిపించాడు. ఆ విషయం తెలిసిన క్లాస్ టీచర్.., అమ్మాయిని ఏడిపించిన వాళ్లందరిని పిలిచి తల్లి తండ్రులను తీసుకురమ్మని చెప్పింది. రవికి తన వల్ల తప్పు జరిగింది అని అర్థమైంది. భయంతో ఇంటికి వెళ్లి ఏడుస్తూ జరిగిన విషయం వాళ్ల అమ్మకి చెప్పాడు. ఎంతో గారాబంగా పెంచుకున్న కొడుకు అంతలా ఏడవడం చూడలేని తల్లి , అసలు నువ్వు చేసింది తప్పే కాదు. నేను వచ్చి మాట్లాడతా మీ టీచర్ తో అని రవి చేసిన తప్పుని సమర్ధించింది. మరునాడు..పిల్లలు వారి పేరెంట్స్ ని