ఒక ప్రేమకథ

  • 3.8k
  • 2
  • 1.6k

నవనీత...! పేరుకు తగ్గట్టుగానే అందమైన అమ్మాయి, అందుకు తగిన అభినయం. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదు, ఒక అమ్మాయిని చూసి చూడగానే ప్రేమలో పడిపోతనని. ఇది ఆకర్షణా ? లేకా నేను నిజంగానే ప్రేమిస్తున్నానా ? అని తెలుసుకోవడానికి నాకు చాలానే సమయం పట్టింది.కాలేజీ లో దసరా సెలవులు ఇచ్చారు. ఎప్పటిలాగే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్లి సరదాగా గడపాలని అనుకున్నాను. కానీ, ప్రతి రోజు ఒక యుగంలా అన్పించింది నవనీతని చూడక. ఎప్పుడు సెలవులు అయిపోతాయా ? ఎపుడెపుడు నవనీతని చూస్తానా ? అని అన్పించింది. కాలేజీ స్టార్ట్ అయిన మొదటి రోజే అందరికంటే ముందుగా కాలేజీ కి వెళ్లి నవనీత కోసం చూసాను. కానీ, తాను ఆ రోజు కాలేజీకి రాలేదు. ఎవరినైనా అడుగుదామంటే, ఏమనుకుంటారో అని భయమేసింది. అలా రెండు రోజులు గడిచాయి. ఇక నవనీత కాలేజీ కి