కలలు నీవే.. కష్టం నీదే.. ఆశలు నీవే.. ఆశయం నీదే..

  • 2.6k
  • 2
  • 1.1k

కొంతమంది చిన్న చిన్న కారణాలతోనే జీవితంలో వెళ్లాల్సిన గమ్యానికి వెళ్లకుండా పక్కకు తప్పుకొంటారు. సరే అవేమైనా పెద్ద పెద్ద కారణాలతోనా అంటే.. చిన్న విషయాలకే. కలలు గొప్పగా ఉంటాయి.. కానీ ప్రయత్నాలే.. మెుదలుకావు.కొంతమంది లేనిపోని కారణాలతో జీవితంలో ఓడిపోతుంటారు. సరే ప్రయత్నం చేసి ఓడిపోతే.. అది ఒక పద్ధతి.. కానీ ప్రయత్నమే మెుదలుకాకుండా.. ఓడిపోయామని ఇంట్లోనే కూర్చొంటారు. ఇలా చేసి ఉంటే బాగుండు.. అలా చేసి ఉంటే ఇంకా బాగుండు.. అంటూ.. ఇతరులకు సూక్తులు చెప్తారు. కానీ అప్పుడే ప్రయత్నం చేసి ఉంటే.. కనీసం ఆశయం కోసం ప్రయత్నం చేశామనే తృప్తి అయినా మిగులుతుంది కదా. ఈ విషయంలో ముందుగా ఓ స్టోరీ తెలుసుకోండి..గద్ద చెప్పే జీవిత పాాఠంఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తుంటాం. మన కంటికి అది.. కోడి పిల్లలను ఎత్తుకుపోయే పక్షి మాత్రమే. కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే.. మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఓ గొప్ప కథ దాగి ఉంది.