నాన్న

  • 3.2k
  • 1
  • 1.1k

నాన్న ఉంటే ఒక ధైర్యం, ఒక అండ, ఒక ఆదరణ.. నాన్న ఒక మేరువు.గంభీరమైన వ్యక్తిత్వానికి చిరునామా నాన్న. నాన్నంటే నా ప్రాణం.నిరాడంబరత, నిస్వార్ధము‌ కలిగి నిర్మలమైన ప్రేమాప్యాయతలను చూపిన నాన్న నా మీదే కాక నా బిడ్డలమీద కూడా అంతే ప్రేమాప్యాయతలను చూపిన మా నాన్న. మధ్య తరగతి సంసార సామ్రాజ్యాన్ని సమర్ధవంతంగా నడిపిన మహరాజు మా నాన్న. నన్ను తన గుండెలమీద ఉంచుకుని మురిపెంగా ఆడిస్తూ, భుజాలమీదకి ఎక్కించుకుని ఆడించిన బంగారు తండ్రి మానాన్న. జీవన సమరంలో కష్షనష్టాలన్నీ తనే ధైర్యంగా ఎదుర్కొని ఏనాడూ వేటికీ భయపడని మహయోధుడు మా నాన్న. అందరూ తనవాళ్లే అనుకుని అందరి సుఖసంతోషాలను కోరుకునే ప్రేమమూర్తి, అల్పసంతోషి మానాన్న. కడదాకా తనకోసం, తన సుఖసంతోషాలకోసం ఏనాడూ ఆలోచించక జీవితమంతా కన్నబిడ్డలకోసం పరితపించిన మానాన్న. ఎవరినుంచీ ఇసుమంతైనా ఏమీ ఆశించని నిస్వార్థుడైన మహా మనీషి మానాన్న. తనకున్నదాంట్లో చేతిన ఎముక లేకుండా అందరికీ దానధర్మాలు