అమ్మమాట

  • 3.7k
  • 1
  • 1.7k

అమ్మమాటజలజలపారే నదిఒడ్డున ఉన్న ఒక్కచెట్టుపై ఒకపక్షి గూడుకట్టుకుని తన చిన్నచిన్నముగ్గురు పిల్లలతో సంతోషంగాకాలం గడుపుతున్నాయి. ఒక నాడు ఆపక్షి తన పిల్లల మేత కోసం వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి మూడు పిల్లలలో ఒక పిల్ల గూటి నుండీ తల బయటకు పెట్టి బయటి ప్రపంచం చూస్తూంది అంతలో తల్లివచ్చి ఆ పిల్లను కోప్పడి, ఇంకెప్పుడు బయటకు చూడకూడదు, పొరపాటున క్రిందపడవచ్చు, లేక మన శత్రువులు హఠాత్తుగా వచ్చి ఎత్తుకెళ్ళవచ్చు, మీరు పెద్ద అయిన తరువాత నాలాగే బయటకు వెళ్ళవచ్చు అని ముద్దుగా మందలించింది, మరునాటి ఉదయం ఆ పక్షి మేతకు వెళ్ళింది, అమ్మమాట లెక్కచేయకుండా ఆ పక్షిపిల్ల మరల గూటి అంచువరకు వచ్చి బయటి వింతలను ఆదమరచి చూస్తుంది. ఆ సమయంలో పెద్దగాలి వీయడంతో పట్టు తప్పి కాలుజారి నదిలో పడి కొట్టుకొని పోయి ప్రాణాలు వదలింది.. వారెడ్డి ॐనీతి: పెద్దలమాట విననిచో ఆపదలు తప్పవు.అమ్మ మాటఒక అడవిలో ఒక