ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 4

  • 5.2k
  • 2.5k

చిన్నప్పటినుంచి మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూనే పెరిగాం కానీ పెళ్ళన గానే ఎందుకో నో చెప్పలేకపోయాను సీత ..... అది ఎందుకనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు !!! కానీ నీ మెడలో తాళి కట్టేటప్పుడు చాలా సంతోషంగా అనిపించింది ...... ఈ ఫీలింగ్ ని ఏమంటారో నాకు తెలియదు కానీ బాగుంది ..... ఇప్పుడు కూడా నువ్వు చిన్నపిల్లల నాతో గొడవ పడుతూ ఉంటే భలే బాగుంది ...... “ అని నవ్వుకుంటూనే నిద్రపోయాడు@@@@@@@తర్వాత రోజు ఉదయం 5 గంటల సమయం సీత రామ్ ల రూమ్ డోర్ దబ దబ బాదుతున్న సౌండ్ కి రామ్ కష్టంగా కళ్ళు తెరిచి కిటికీలో నుంచి బయటికి చూస్తే ఇంకా చీకటిగా ఉండటం అందులోనూ తన మీద కొంచెం బరువుగా ఉండటం అర్థమవుతున్న పట్టించుకోకుండా తనని ఎవరు వచ్చి తనని డిస్టర్బ్ చేసారో అర్థం కాక తనమీద బరువు ఏంటా అని చూసేసరికి