ప్రేమాధ్యంతం - 3

  • 8.3k
  • 3.3k

తన కన్నీళ్లు సున్నితంగా తుడుస్తున్న ఆ చేతిని అలానే పట్టుకొని నుదురుకి ఆణించుకుంటుంది కోమలి.ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న తనని దగ్గరికి తీసుకొని వెన్ను నిమురుతుంటే తన అత్తయ్య గుండెల్లో ఒదిగిపోయి మరింతగా రోదిస్తుంది కోమలి మనసు."మళ్ళీ చెప్తున్నాను బంగారం, ఇక్కడి నుండి ఎలాగైనా తప్పిస్తాను, వెళ్ళిపోరా?"... అని బాధగా అడుగుతున్న మాళవిక గారి మాటకి అడ్డంగా తల ఊపుతుంది.మరు నిమిషం కోమలి చెంప మీద చిన్నగా కొట్టి కోపంగా కన్నీళ్లు పెట్టుకుంటుంటే తన అత్తయ్య కన్నీళ్లు తుడుస్తూ బలవంతంగా నవ్వుతుంది."ఎందుకే.. ఎందుకే ఇలా ప్రతిసారి మొండిగా ప్రవర్తిస్తావు? ఇంటిల్లిపాది నీకు సహాయం చేస్తాం అంటుంటే నువ్వెందుకే ఇక్కడే ఉంటే వాడి రాక్షసత్వానికి బలి అవ్వాలి అని అనుకుంటున్నావు?....మరింత స్వచ్ఛంగా నవ్వుతు తన మెడలో ఉన్న ఎర్ర దారాన్ని చూపిస్తుంది కోమలి.అసహనంగా మారిపోతారు మాళవిక గారు."అది తాళి అని నువ్వు అనుకున్నా, నిన్ను వాడికి బానిసగా మార్చుకున్న బలి తాడే అది, దానికి