ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 1

(11)
  • 13.2k
  • 1
  • 6.1k

బావ మరదలి మధ్య చిలిపి తగాదాలతో సాగే సంసార సమాహారమే ఈ నా కథ..... అభిరామ్ ️ సీతామహాలక్ష్మి@@@@@@@అనగనగనగా అది ఒక పల్లెటూరు పేరు వీరభద్రపురం..... ఉదయాన్నే ఆ ఊరిలో ఊరి పెద్ద ఇంటి ముందు పెద్ద పండిరి ఊరంతా వినిపించేలా మైకులు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తున్నారు వారి మనవడు మనవరాలికి....కుటుంబం మొత్తం పెళ్లికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒప్పుకోవటంతో మనసంతా ఉప్పొంగిపోతున్నంత సంతోషంతో పెళ్లి పనులలో యాక్టివ్గా పాలుపంచుకుంటూ ఉంటే ఊరందరూ ఊరు పెద్ద ఇంట్లో పెళ్లి అని వాళ్లకు తోచిన సాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉన్నారు.....పెళ్లికూతురు గదిలో పెళ్లికూతురు తెల్లని తెలుపు , కలువ లాంటి కళ్ళు , తీరైన ముక్కు , దొండ పండు లాంటి పెదవులు , అందంగా నవ్వితే బుగ్గన పడే చోట్ట , గడ్డం మీద చిన్న పుట్టుమచ్చ తన అందానికి మొత్తం దిష్టి తగలకుండా ఉన్నట్టు ఉంటే ,