నిజం - 32

  • 5.1k
  • 1.6k

విజయ్ మాటలకు రామారావు గారు సరే అని తల వూపుతోంటే మరో పక్క సాగర్ , విజ్జి మాత్రం విజయ్ వైపు జాలిగా చూస్తూ వున్నారు . వాళ్ళిద్దరినీ గమనించిన విజయ్ వీళ్లిద్దరూ మా పెదనాన్న కి అనుమానం వచ్చేటట్టు బిహేవ్ చేస్తున్నారు అని మనసులో అనుకొని ,సాగర్ ఇక వెళదామా అన్నాడు భుజం గట్టిగా నొక్కుతూ , విషయం అర్థమయయిన సాగర్ ఆ వెళదాం అని రాని నవ్వు తెచ్చుకొని సరే వెళ్ళొస్తాము అని అందరికీ చెప్పి విజ్జి ని తీసుకొని బయటికి నడిచాడు వాళ్ళ వెనుకే విజయ్ కూడా బయటకు నడిచాడు.బయట జీప్ లో రాఘవులు వచ్చి ముగ్గురినీ ఎక్కించుకొన్నాడు ఎలా జరిగింది sir ప్రయాణం , ఇంతకీ వెళ్లిన విషయం ఏమయింది , సాగర్ ని ఫోన్ లో అడిగితే అక్కడికి వచ్చాక చెప్తా అన్నాడు అని మాట్లాడుతూ వుంటే విజయ్ మాత్రం పరధ్యానం గా వున్నాడు