నిజం - 31

  • 4.6k
  • 1.9k

గంగ తనకు నిజంగానే చెల్లి అని గుర్తువచ్చి విజయ్ పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి . ఇప్పుడు ఇది నా ఫ్యామిలీ వాళ్ల జోలికి వచ్చిన వాళ్ళని అస్సలు వదలి పెట్టను, అనుకుంటూ తన పిడికిలి గట్టిగా బిగించాడు. నేను ఇక్కడకి వచ్చి చాలాసేపయింది అందరూ నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు అనుకుని అక్కడి నుండి సాగర్ వాళ్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. గంగ, విజ్జి లకు ఫొటోస్ తీస్తున్న సాగర్ విజయ్ ని చూసి ఇంతసేపు ఏం చేస్తున్నావురా , వీళ్లిద్దరూ ఫొటోస్ , వీడియోస్ ఏంటూ నా బుర్ర తినేస్తున్నారు అనగానే గంగా , విజ్జి కోపంగా సాగర్ వైపు చూసారు , అబ్బే సరదాగ అన్నాను అంతే అనేశాడు నవ్వుతూ సాగర్. ఇంతకీ ఇంతసేపు ఎవరితో కాల్ మాట్లాడవు అన్నాడు అన్నాడు సాగర్ విజయ్ ని చూస్తూ , విజ్జి గంగా కూడా తన వైపే క్యూరియస్ చూడడం చూసి