నిజం - 27

  • 3.7k
  • 1.4k

అరే , ఇంక స్టార్ట్ అవుదాం మళ్ళీ లేట్ నైట్ అయితే డ్రైవింగ్ కష్టం అవుతుంది ఆ రూట్ లో అన్నాడు సాగర్. ఓకె రా పదండి , సాగర్ కార్ కీస్ ఇవ్వు నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు విజయ్. మళ్ళీ వాళ్ల ప్రయాణం స్టార్ట్ చేసారు , చాలా సేపు సైలెంట్ గానే వున్నారు నలుగురూ . మా బాబాయ్ నిజంగానే చెడ్డవాడా అసలు తాతయ్య ఆయన్ని ఇంటి నుండి ఎందుకు పంపించేసి వుంటారు, నాన్న ఏమో బాబాయ్ గురించి ఎప్పుడూ మంచిగానే చెప్పాడు అని మనసులో అనుకుంటూ వుంది గంగ. సాగర్ : ఏంటి బావ ఇంకా ఆ పీటర్ గురించే ఆలోచిస్తూ ఉన్నావా , అలాంటి వాడికి శత్రువులకు కొదవ వుంటుందా చెప్పు , ఎవడో కాపు కాసి చంపేసి వుండొచ్చు . విజయ్ : ఆ పీటర్ ని చివరిసారిగా చూసిన అతను ,